క్యూబా విప్లవయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో సమీకాలిన
చరిత్రపై చెరుగని ముద్రవేశారు. విప్లవానికి ప్రతీకగా, చేగువేరాకు
ఆప్తమిత్రుడిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో స్ఫూర్తినింపారు. తన
గురించి, కమ్యూనిజం గురించి వివిధ సందర్భాల్లో ఆయన పేర్కొన్న గుర్తుండిపోయే
వ్యాఖ్యలివి..
నన్ను ఖండించండి. ఏం ఫర్వాలేదు. రేపు చరిత్రే నన్ను అర్థం చేసుకుంటుంది.
- శాంటియాగో డి క్యూబాలోని సైనిక బ్యారక్‌లపై దాదాపు ఆత్మాహుతి దాడులు జరపడంపై 1953లో తనను తాను సమర్థించుకుంటూ క్యాస్ట్రో
82మందితో నేను విప్లవాన్ని ప్రారంభించాను. మరోసారి విప్లవాన్ని చేయాలనుకుంటే కేవలం 10, 15మందితో, సంపూర్ణ విశ్వాసంతో చేస్తాను. మీ మీద మీకు విశ్వాసం ఉండి, కచ్చితమైన కార్యాచరణ ఉంటే మీరు చిన్నవారైనా పెద్ద విషయమే కాదు. - 1959లో క్యాస్ట్రో
నా గడ్డన్ని గీయించుకోవాలని నేను అనుకోవడం లేదు. నేను దీనికి అలవాటుపడిపోయాను. నా గడ్డం మా దేశానికి సంబంధించినది అంశం. సుపరిపాలన అందిస్తామన్న మా వాగ్దానం నెరవేరిన నాడు నేను గడ్డాన్ని తీస్తాను. - 1959లో విప్లవం విజయవంతమైన 30 రోజుల అనంతరం సీబీఎస్ చానెల్ ఇంటర్వ్యూలో క్యాస్ట్రో
క్యూబన్ ప్రజారోగ్యం కోసం నేను చేయాలనుకున్న చివరి త్యాగం.. పొగ తాగటాన్ని మానెయ్యడం. కానీ దానిని నేను చేయలేకపోయాను.
- 1985 డిసెంబర్లో తాను పొగతాగడం మానేశానని ప్రకటిస్తూ క్యాస్ట్రో
నాలోని భావజాలాలకు, ఆ అసాధారణ వ్యక్తి (జీసెస్ క్రైస్ట్)లోని భావజాలాలకు ఎలాంటి వైరుధ్యాన్ని నేను చూడలేదు
- 1985లో క్యాస్ట్రో
సోషలిస్టు వర్గం కనుమరుగై ఉండి ఉంటే ప్రపంచం ఎలా ఉండేదో ఊహించండి. ఇది సాధ్యమా అంటే సాధ్యమేనని నేను భావించను.
- 1989లో క్యాస్ట్రో
విప్లవం అందించిన గొప్ప ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే మా వేశ్యలు కూడా పట్టభద్రులే
- డైరెక్టర్ ఆలివర్ స్టోన్ 2003లో తీసిన డాక్యుమెంటరీ 'కమాండెంట్'పై క్యాస్ట్రో
క్యూబన్ మోడల్ మనకోసం ఇక ఎంతమాత్రం పనిచేయబోదు
- 2010లో అమెరికా జర్నలిస్ట్ జెఫ్రీ గోల్డ్‌బెర్గ్‌తో ఇంటర్వ్యూలో క్యాస్ట్రో.. ఆ తర్వాత తన వ్యాఖ్యను సందర్భోచితంగా తీసుకోలేదని క్యాస్ట్రో పేర్కొన్నారు.
అమెరికాతో చేయబోయే యుద్ధమే నా నిజమైన గమ్యమని నేను గుర్తించాను
- 2004లో ఒలివర్ స్టోన్ తీసిన రెండో డాక్యూమెంటరీ 'లుకింగ్ ఫర్ ఫిడెల్' లో క్యాస్ట్రో ప్రారంభ మాటలు
80ఏళ్ల వసంతంలోకి అడుగుపెట్టడం నిజంగా ఆనందంగా ఉంది. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ పవర్‌గా పేరొందిన పొరుగుదేశం ప్రతిరోజూ నన్ను చంపేందుకు ప్రయత్నిస్తుండగా. ఇంతకాలం బతకుతానని నేను అనుకోలేదు.
- 2006 జూలై 21న అర్జెంటినాలో జరిగిన లాటిన్ అమెరికా అధ్యక్షుల సదస్సులో క్యాస్ట్రో

667 సార్లు చంపాలనుకున్నారు..
అమెరికా తనకు ఆగర్భ శత్రువైన క్యూబా మాజీ అధ్యక్షుడు, వీర విప్లవ యోధుడు
ఫిడెల్ క్యాస్త్రోను చంపేందుకు చేయని ప్రయత్నం లేదు. 600 సార్లుకుపైగా
ప్రయత్నించి విఫలమైనట్లు చరిత్ర తెలియేస్తోంది. జేమ్స్‌బాండ్
సినిమాల్లోలాగా సిగార్లలో విషం నింపడం ద్వారా, పెన్నులోని సిరాలోకి విషం
ఎక్కించడం ద్వారా, అందమైన అమ్మాయిలతోని, మాజీ భార్యతోని విషపు గుళికలను
తినిపించడం ద్వారా, సముద్ర నత్త గుళ్లల్లో శక్తివంతమైన చిన్న బాంబులను
అమర్చడం ద్వారా, ప్రత్యేకమైన మాఫియా పద్ధతుల్లో క్యాస్ట్రోను చంపేందుకు
అమెరికా సీఐఏ ప్రయత్నించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్ కెన్నడీ అయితే
క్యాస్ట్రోను హతమార్చేందుకు 'ఆపరేషన్ మంగూస్' పేరిట పెద్ద వ్యూహమే
రచించారు.
అన్నీ హత్యా ప్రయత్నాల నుంచి జేమ్స్బాండ్కన్నా చాకచక్యంగా తప్పించుకున్న క్యాస్త్రో ఓ సందర్భంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నాల గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి ప్రయత్నాల నుంచి తప్పించుకున్నవారి మధ్య ఓలింపిక్స్ పోటీ పెట్టినట్లయితే కచ్చితంగా తనకు బంగారు పతకం వచ్చేదని వ్యాఖ్యానించారు. తనమై అమెరికా నీడ కూడా పడకుండా చివరి వరకు కమ్యూనిస్టు యోధుడుగా పోరాడిన కాస్ట్రో సహజసిద్ధంగా తన 90వ ఏట కన్నుమూశారు. క్యాస్ట్రోను చంపేందుకు 667 సార్లు అమెరికా సీఐఏ కుట్ర పన్నిందని ఆయన వెన్నంటే ఉండి అనేకసార్లు ఆయన్ని ఈ హత్యాప్రయత్నాల నుంచి రక్షించిన రిటైర్డ్ క్యూబా ఇంటెలిజెన్స్ అధికారి ఫాబియన్ ఎస్కలాంటే తెలిపారు.
క్యాస్ట్రో మాజీ భార్య మారిటా లారెంజ్ ద్వారా విషపు గుళికలు ఇచ్చి చంపేందుకు సీఐఏ ప్రయత్నించడం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. తాను గర్భవతి అయ్యేవరకు క్యాస్ట్రోతో కలసివున్న లారెంజ్ ఓ రోజు హఠాత్తుగా జబ్బున పడ్డారు. వైద్యం కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఆమెను కలసుకున్న సీఐఏ అధికారులు, లారెంజ్‌కు ఆలస్యంగా ఆబార్షన్ చేయించి ప్రాణం మీదకు తీసుకరావాలని క్యాస్ట్రో కుట్రపన్నినట్లు ఆమెను నమ్మించారు. ప్రతిగా అమెరికా ప్రజల కోసం క్యాస్ట్రోను భోజనంలో విషపు మాత్రలు కలిపి చంపేయాలని సూచించారు. ప్రమాదకరమైన విషపు గుళికను కూడా ఇచ్చి పంపారు. క స్టమ్స్ అధికారుల కళ్లుకప్పి కూడా ఆమెను క్యూబాకు పంపించారు.
అమెరికాలలో లారెంజ్ను సీఐఏ అధికారులు కలసుకున్న విషయాన్ని తన వేగుల ద్వారా తెలసుకున్న క్యాస్ట్రో అతి జాగ్రత్తగా లారెంజ్ ప్రవర్తనను గమనిస్తూ వచ్చారు. అమె తన కోల్డ్ క్రీమ డబ్బాలో దాచిన విషపు మాత్రను క్యాస్ట్రో ఓ రోజు కనుక్కున్నారు. అప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి తన పిస్టల్ తీసి అమెకిచ్చి తనను చంపాలనుకుంటే నేరుగానే చంపాలని ఆమెకిచ్చారట. కళ్లు మూసుకొని సిగరెట్ పొగ వదులుతూ నుదిటిపై గురిచూసి కాల్చమని చెప్పారట. దానికి లారెంజ్ వనికిపోతూ పిస్టల్ నుంచి తుపాకీ గుళ్లను తీసేసి, పొరపాటుపడ్డాను, క్షమించడంటూ క్యాస్ట్రో కౌగిట్లో వాలిపోయారట. ఆ తర్వాత ఆమె ఈ విషయాన్ని ప్రజల ముందు బహిర్గతం చేసింది. కారు యాక్సిడెంట్ల ద్వారా, క్యాస్ట్రో తరచుగా వెళ్లే బేస్‌బాల్ స్టేడియంలలో గ్రెనేడ్ల ద్వారా చంపేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారని ఎస్కలాంటే మీడియాకు అనేక సందర్భాల్లో వెల్లడించారు. 1990లో ఐక్యరాజ్యసమితి సమావేశంలో క్యాస్ట్రో మాట్లాడేందుకు వచ్చినప్పుడు ఆయన బూట్లపై రసాయనిక పౌడర్ సిఐఏ చల్లిందట. బూట్లు ఇప్పుకోవడం, కట్టుకోవడం వల్ల ఆ పౌడర్ రియాక్షన్ ద్వారా ఆయన గడ్డం ఊడిపోవాలన్నది కుట్రట. ఎల్ఎస్డీ నింపిన సిగరెట్లు అందించడం ద్వారా కూడా చంపాలనుకున్నట్లు 'ఏ 167 ప్లాట్స్ అగెనెస్ట్ క్యాస్ట్రో' అనే పుస్తకంలో ఎస్కలాంటే వివరించారు. ఆయాన ఆ పుస్తకంలో కుట్రలకు డాక్యుమెంట్ ఆధారాలు కూడా చూపించారు